Pakistan: ఏడు సంవత్సరాల కిందట అదృశ్యమైన కొడుకు.. బిక్షాటన చేస్తుండగా గుర్తు పెట్టిన తల్లి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఓ సన్నివేశం మనసును కదిలించింది. 2016లో తప్పిపోయిన కొడుకును తల్లి ఏడేళ్ల తర్వాత గుర్తు పట్టింది.
అది కూడా అతను బిక్షాటన చేస్తుండగా చూసిన ఆ తల్లి హృదయం విలవిలలాడింది.
రావల్పిండిలోని తహ్లీ మోహ్రీ చౌరస్తా వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
షహీన్ ఆక్తర్ కుమారుడు ముస్తకీర్ ఖలీద్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు.
ముస్తకీర్ 2016లో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ తప్పిపోయాడు.
ఈ విషయంపై ఆమె తల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
తన కుమారుడు డిప్రేషన్ కారణంగా ఇంటిని విడిచి వెళ్తుంటాడని షహీన్ ఆఖ్తర్ పేర్కొంది.
Details
ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
తహ్లీ మొక్రి చౌరస్తాలో ముస్తకీర్ ఖలీద్ యాచకుల ముఠాతో కలిసి బిక్షాటన చేస్తుండగా షహీన్ గుర్తు పెట్టింది.
అయితే ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన ఈ ముఠా అంగవైకల్యంతో బాధపడుతున్న ముస్తాకీమ్ తో బలవంతంగా బిక్షాటన చేయించారు. యాచకుల ముఠా హసీన్ పై దాడి చేసింది.
ఇక ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు సభ్యులతో కూడిన మాఠాను పోలీసులు అరెస్టు చేశారు.