Page Loader
New China Virus: కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు
కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు

New China Virus: కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

కరోనా మహమ్మారి మానవాళిపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్లు మంది జీవనోపాధి లేక రోడ్డున పడ్డారు. అయితే అలాంటి మరొక విపత్తు మళ్లీ రావచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనాలో శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను పోలిన మరో కొత్త వైరస్‌ను గుర్తించారు. దీని పేరు 'HKU5-CoV-2'గా గుర్తించారు. ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాపించే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్, కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉందని వెల్లడించారు. ఈ విషయాన్ని హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది.

Details

బ్యాట్ ఉమెన్ నేతృత్వంలో కొత్త పరిశోధన

గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై విస్తృత పరిశోధనలు నిర్వహించి 'బ్యాట్ ఉమెన్' గా గుర్తింపు పొందిన ప్రముఖ వైరాలజిస్ట్ షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించారు. ఈ అధ్యయనంలో గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌, వుహాన్‌ యూనివర్సిటీ, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వారి పరిశోధనలు పీర్ రివ్యూడ్ జర్నల్ సెల్‌లో మంగళవారం ప్రచురితమయ్యాయి.

Details

MERSకు సమానమైన కొత్త వైరస్ 

ఈ కొత్త వైరస్ మెర్బెకోవైరస్ ఉపజాతికి చెందినదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వైరస్ లక్షణాలను కలిగి ఉంది. మొదట హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ గబ్బిలాల్లో ఈ వైరస్ గుర్తించారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, ఇది నేరుగా లేదా మధ్యస్థ జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశముంది. కరోనా అంత ప్రమాదకరం కాదా? ఇది కరోనా వైరస్‌తో పోలిస్తే ఇది అంత తీవ్ర ప్రభావం చూపించే అవకాశం తక్కువ. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం ఉన్నా, ఈ వైరస్ ఇంకా పెద్ద స్థాయిలో మానవులపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.