Page Loader
Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు 
Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు

Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు 

వ్రాసిన వారు Stalin
Jan 11, 2024
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రలో అభియోగాలు మోపబడిన నిఖిల్ గుప్తా న్యాయవాదులు దాఖలు చేసిన మోషన్‌పై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిఖిల్ గుప్తా న్యాయవాదుల దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని న్యూయార్క్ కోర్టు బైడెన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గురుపత్‌వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్య కుట్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను దాఖలు చేయాలని న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టు కోరింది. నిఖిల్ గుప్తా తరఫున జనవరి 4, 2024న డిఫెన్స్ న్యాయవాది మోషన్‌ పిటషన్ దాఖలు చేశారు. అయితే మూడు రోజులల్లో సమాధానం చెప్పాలని డిస్ట్రిక్ట్ జడ్జి విక్టర్ మర్రెరో బైడెన్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

అమెరికా

నేరం రుజువైతే 20ఏళ్ల జైలు శిక్ష

అమెరికా, కెనడాలో ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న సిక్కు నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నడంలో గుప్తా ఓ భారత ప్రభుత్వ ఉద్యోగికి హకరించాడని యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. న్యూయార్క్‌లో యూఎస్-కెనడియన్ ద్వంద్వ పౌరుడైన పన్నూన్‌ను హత్య చేసినందుకు ఉద్దేశించిన హిట్‌మ్యాన్‌కు నిఖిల్ గుప్తా 100,000 డాలర్ల సుపారీ ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నిఖిల్ గుప్తా సుపారీ ఇచ్చిన వ్యక్తి రహస్య ఫెడరల్ ఏజెంట్ అని ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఒకవేళ, నేరం రుజవైతే, నిఖిల్ గుప్తాకు 20ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ మాథ్యూ జి ఒల్సేన్ అన్నారు.