Page Loader
Brazilian Singer: లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచిన సింగర్
లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచిన సింగర్

Brazilian Singer: లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచిన సింగర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2023
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్ దేశంలో విషాదం జరిగింది. బ్రెజిల్ గోస్పెల్‌లో మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పేరుకెక్కిన పెడ్రో హెన్రిక్ లైవ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచాడు. 30 ఏళ్ల అతి పిన్న వయస్సులోనే ఆయన అలా మరణించడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఊహించని ఈ పరిణామంతో ప్రదర్శనకు హజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డిశాంటో స్టేజ్‌పై లైవ్ ప్రదర్శన ఇస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెడ్రో ఒక్కసారిగా కుప్పకూలడంతో సిబ్బంది హుటాహుటినా సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పెడ్రో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Details

విషాదంలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ

ప్రదర్శన చేస్తున్న సమయంలో పెడ్రో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయాడు. ఈ క్రమంలో తల నేలకు బలంగా తగిలింది. ఆ సమయంలోనే గుండెపోటు రావడంతో చనిపోయాడని వైద్యులు పేర్కొన్నారు. బ్రెజిల్ గోస్సెల్ రైజింగ్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణవార్తతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.