Page Loader
వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్ 
వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్

వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్ 

వ్రాసిన వారు Stalin
Jun 05, 2023
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా వాషింగ్టన్ డీసీలోని గగనతలంలో ఓ చిన్న విమానం రచ్చరచ్చ చేసింది. భారీ శబ్దాలతో కింద నుంచి వెళ్తున్న బిజినెస్ జెట్‌ని యునైటెడ్ స్టేట్స్ F-16 ఫైటర్ జెట్‌ వెంబడించింది. ఈ క్రమంలో ఆ చిన్న బిజినెస్ క్లాస్ విమానం వర్జీనియా పర్వతాలపై కుప్పకూలిపోయిందని తెలిపారు. వాస్తవానికి టేనస్సీలోని ఎలిజబెత్టన్ మునిసిపల్ విమానాశ్రయం నుంచి న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మాక్‌ఆర్థర్ విమానాశ్రయానికి ఆ చిన్న విమానం బయలుదేరింది. అయితే విమానం న్యూయార్క్ ప్రాంతానికి చేరుకునే క్రమంలో ఒక్కసారిగా 180 డిగ్రీల మలుపు తిరిగి వర్జీనియా వైపు దూసుకెళ్లింది. పెద్దపెద్ద సోనిక్ బూమ్ శబ్దాలతో విమానం వాషింగ్టన్ డీసీ ప్రజలను హడలెత్తించింది. ఈక్రమంలో ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి.

అమెరికా

శిథిలాలను వెతుకున్న వర్జీనియా పోలీసులు 

భారీ శబ్దాలు చేసుకుంటూ అనుమానాస్పదంగా వెళ్తున్న చిన్న బిజినెస్ జెట్‌ను F-16 ఫైటర్ జెట్‌ వెంబడించింది. చిన్న విమానంలోని పైలెట్‌ను అలర్ట్ చేసేందుకు ఎన్ఓఆర్డీఏ తమ యుద్ధ విమానం నుంచి మంటలను కూడా విడుదల చేశారు. అయినా చిన్న విమానంలోని పైలట్ గ్రహించలేదు. ఈ క్రమంలో నేరుగా వెళ్లి వర్జీనియా పర్వతాలపై వెళ్లిన చిన్న విమానం అక్కడే కుప్పకూలిపోయింది. ప్రమాదానికి గురైన చిన్న విమానం ఫ్లోరిడాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఎంకోర్ మోటార్స్‌కు చెందనదిగా గుర్తించారు. తన కుమార్తె, మనవడు, ఆయా ఆ విమానంలో వెళ్తున్నారని జాన్ రంపెల్ వాషింగ్టన్ పోస్ట్‌కి తెలిపారు. వర్జీనియా పోలీసులు శిథిలాల కోసం వెతుకుతున్నారని, అందులో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు.