White House: వైట్ హౌస్ గేట్‌ను ఢీకొన్న వాహనం, డ్రైవర్ అరెస్ట్
ప్రెసిడెన్షియల్ మాన్షన్ కాంప్లెక్స్ వెలుపలి గేటుపై వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తిని సోమవారం వైట్ హౌస్(white house) సమీపంలో అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. ఈ సంఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో లేరు. సాయంత్రం 6 గంటల సమయంలో,ఒక వాహనం వైట్ హౌస్ కాంప్లెక్స్‌లోని బయటి గేటును ఢీకొట్టింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం.కారు గేటును ఢీకొనడానికి గల కారణం,తీరును పరిశీలిస్తున్నాము," అని US సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ Guglielmi ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు.
అదుపులో డ్రైవర్.. కొనసాగుతున్న విచారణ
ఈ ఘటన జరిగినప్పుడు15 స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వాహనం ఢీ కొట్టిన తరువాత వాషింగ్టన్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. డ్రైవర్ అదుపులోనే ఉన్నాడని, విచారణ కొనసాగుతోంది" అని గుగ్లీల్మి చెప్పారు. 2017లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఉండగా ఓ వ్యక్తి కంచె దాటి అధ్యక్ష భవనంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. 2014లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు, US ఆర్మీ వెటరన్ అధికారి ఒకరు, జేబులో కత్తితో వైట్ హౌస్ లోకి ప్రవేశించాడు.