Page Loader
PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు?
అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు?

PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. చల్లని వాతావరణం ఉన్నప్పటికీ వాషింగ్టన్‌ డీసీలో భారతీయ ప్రవాసులు తనకు ప్రత్యేక స్వాగతం పలికారని, వారికి కృతజ్ఞతలని మోదీ తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారత్‌-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయానికి ఈ పర్యటన పురోగమనంగా ఉంటుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్‌ సభ్యులు, ఇతర ప్రముఖులతో భేటీ కానున్నట్లు వెల్లడించారు.

Details

తులసీ గబ్బార్డ్‌తో సమావేశం

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై చర్చలు జరిపినట్లు మోదీ తన ఎక్స్ వేదికగా తెలిపారు. ఎలాన్ మస్క్‌తో భేటీ ఈ పర్యటనలో మోదీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్‌లింక్‌ సేవలు, భారత్‌లో టెస్లా విస్తరణపై చర్చించే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా పర్యటన - ద్వైపాక్షిక చర్చలు మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు బయలుదేరే ముందు, ఈ పర్యటన భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

Details

వాణిజ్య ఒప్పందాలు, సుంకాల రాయితీలపై ప్రధాన చర్చ

తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, రక్షణ, ఇంధన సరఫరా రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలపరిచేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరువురు నేతలు మొదటిసారి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య ఒప్పందాలు, సుంకాల రాయితీ, అక్రమ వలసదారుల అంశాలు ప్రధాన చర్చా విషయాలుగా ఉంటాయని అంచనా. అమెరికాకు పయనమయ్యే ముందు మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించి, ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ & ప్రాంతీయ అంశాలు చర్చకు వచ్చాయి.