Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కండోలీజా రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఐదు నిమిషాలకు అమెరికా భారత్‌ను లాయల్టీ టెస్ట్‌లో ఉంచలేమని ఆమె వ్యాఖ్యానించారు. భారతదేశం-అమెరికా సంబంధాలను శాశ్వతమైనవి అని, ద్వైపాక్షికంగా వర్గీకరించినట్లు ఆమె తెలిపారు. వైట్ హౌస్‌కు ఎవరు వచ్చినా ఈ సంబంధం ప్రాముఖ్యత అర్థమవుతుందని ఆమె చెప్పారు. భారతదేశాలు వ్యూహాత్మక స్వతంత్రాన్ని కోరుకుంటున్నామని, ఇందులో నాకు ఎటువంటి సమస్య లేదన్నారు. కానీ మన రెండు దేశాల లోతైన ప్రయోజనాలు, బలమైన భాగస్వామ్యానికి దారి తీస్తాయని ఆమె అన్నారు.
అమెరికా
మోదీ రష్యా పర్యటన రక్షణ రంగంలో పెద్దగా మార్పులు తీసుకురాదని ఆమె అన్నారు. అమెరికా, భారత్ సైనిక సహకారాన్ని పెంచుకోవడంలో నిదానంగా వ్యవహరిస్తోందని, కొంత కీలకమైన సమయాన్ని కోల్పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉన్న సంబంధం భారతదేశానికి సవాలుగా మారుతుందని, మోదీ ఈ విషయం తెలుసుకున్నారని రైస్ చెప్పారు. చైనా సాంకేతికతను ప్రభావితం చేస్తూ, ప్రపంచ నెట్‌వర్క్‌లు, సరఫరా గొలుసులలో బాగా కలిసిపోయిందని ఆమె చెప్పారు.