
Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహ్మద్ యూనస్ భారత్‌పై వ్యతిరేక దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు.
తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడుతూ భారత్‌పై విమర్శలు గుప్పించారు.
బంగ్లాదేశ్, నేపాల్, భారత ఈశాన్య రాష్ట్రాల మధ్య సమగ్ర ఆర్థిక సమైక్యత అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
జలవనరులు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పరస్పర సహకారం కీలకమని అన్నారు.
ఈ వ్యాఖ్యలు నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో సమావేశమైన సందర్భంలో చేశారు.
ప్రస్తుతం భారత్‌కు క్రమంగా దూరమవుతున్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, చైనాలతో సంబంధాల బలీకరణకు కృషి చేస్తూ ఈ తరహా వైఖరిని అవలంబిస్తోంది.
వివరాలు
భారత ఈశాన్య రాష్ట్రాలపై అనుచిత వ్యాఖ్యలు
ఇక గత నెలలో యూనస్ చైనాలో పర్యటించిన సందర్భంలో, డ్రాగన్ బంగ్లాదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరించుకోవచ్చని ఆహ్వానం తెలిపారు.
అంతే కాకుండా, భారత ఈశాన్య రాష్ట్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
"భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు. అవి పూర్తిగా బంగ్లాదేశ్‌తో చుట్టుముట్టబడ్డ ప్రాంతాలు. సముద్రానికి చేరుకునే మార్గం వారికిలేదు. అలాంటప్పుడు మేమే వారికీ సముద్రానికి దారినివ్వగల మార్గం. ఇది ఒక గొప్ప అవకాశం.చైనా తన ఆర్థిక ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఇది అనుకూల పరిస్థితి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
దీనిపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది.ఈనేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి బదులు ఇచ్చారు.
వివరాలు
భారత్ ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో భూసరిహద్దులు కలిగి ఉంది
"బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న దేశాలకు గల ఉమ్మడి ప్రయోజనాలు,సమస్యలు ఉన్నాయి. వాటిలో కొన్ని చారిత్రక సంబంధాల వలన ఏర్పడ్డవే.అయితే కొన్ని సందర్భాల్లో ప్రాదాన్యతలు మారిపోతూ,ప్రాంతీయ శ్రేయస్సును దెబ్బతీశాయి. భారత్‌కు బంగాళాఖాతం పరిసరాల్లో 6,500 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. భారత్ ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో భూసరిహద్దులు కలిగి ఉంది. అలాగే ఆసియన్ దేశాలతో సదుపాయాల అనుసంధానానికి భారత్ మద్దతు ఇస్తోంది. ముఖ్యంగా భారత ఈశాన్య ప్రాంతం ఇప్పుడు బిమ్స్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, విద్యుత్ గ్రిడ్‌లు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌లు వంటి అనేక మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానాన్ని సాధిస్తోంది. ఇది నిజమైన గేమ్ ఛేంజర్" అని జైశంకర్ పేర్కొన్నారు.
వివరాలు
ఈ రాష్ట్రాలను 'సెవెన్ సిస్టర్స్'గా పిలుస్తారు
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలను 'సెవెన్ సిస్టర్స్'గా పిలుస్తారు.