
Kamala Harris: 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' X ఖాతా తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారానికి పెద్ద మొత్తం నిధులు సమకూరుతున్నారు.
గడిచిన వారం వ్యవధిలో 200 మిలియన్ డాలర్ల నిధులు అమె ప్రచారం కోసం నిధులు అందాయి. మరోవైపు పార్టీలో అభ్యర్థితం కోసం కమలా హారిస్‌కు మద్దతు పెరిగింది.
ఇప్పటికే 'వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్' ద్వారా $4 మిలియన్లు వరకు విరాళాలు అందాయి. అయితే ఈ ఎక్స్ ఖాతాలో దీన్ని ఆకస్మికంగా తొలిగించారు.
దీనిపై ఓ అర్గనైజర్ రాస్ మోరేల్స్ రాకెట్టో స్పందించాడు. తన వ్యక్తిగత ఖాతాలో ఎలాన్ మస్క్ భయపడ్డాడు అని పోస్టు చేశాడు.
Details
"వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్"లో పలువురు ప్రముఖులు
"వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్" కోసం బ్యాకప్ ఖాతా సోమవారం మధ్యాహ్నం సృష్టించారు. ఈ కొత్త ఖాతాలలో దాదాపు 5,000 మంది అనుచరులు ఉన్నారు.
అసలు ఆ ఖాతా సస్పెన్షన్ వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదు.
"వైట్ డ్యూడ్స్ ఫర్ హారిస్"లో జెఫ్ బ్రిడ్జెస్, మార్క్ హామిల్, జోసెఫ్ గోర్డాన్-లెవిట్, బ్రాడ్లీ విట్‌ఫోర్డ్, సీన్ ఆస్టిన్ మరియు జోష్ గ్రోబన్ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.
రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు వ్యతిరేకంగా హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే $4 మిలియన్లను సేకరించింది.