LOADING...
Air India Ahmedabad plane crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మృతదేహాలు తారుమారు!
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మృతదేహాలు తారుమారు!

Air India Ahmedabad plane crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మృతదేహాలు తారుమారు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పౌరులకు సంబంధించి ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు తప్పుగా రెండు మృతదేహాలను పంపినట్లు సంబంధిత బాధిత కుటుంబాల న్యాయవాది వెల్లడించారు. వారు చెబుతున్న ప్రకారం, మృతదేహాలకు తిరిగి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా,కనీసం రెండు శవ పేటికల్లో వ్యత్యాసాలు వెల్లడయినట్లు ఆరోపించారు. డీఎన్ఏ ఫలితాల ప్రకారం, ఆ రెండు మృతదేహాల అవశేషాలు వాటిని అందుకున్న కుటుంబాలకు సరిపోలలేదని తెలుస్తోంది.

వివరాలు 

 మొత్తం 12 నుంచి 13 మృతదేహాల అవశేషాలు యూకేకు.. 

ఈ విషయమై అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన కుటుంబాల తరఫున వాదిస్తున్న న్యాయవాది జేమ్స్ హేలీ చెబుతున్న ప్రకారం.. జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదం తర్వాత, మొత్తం 12 నుంచి 13 మృతదేహాల అవశేషాలను యూకేకు పంపించినట్లు చెప్పారు. అయితే, డీఎన్ఏ విశ్లేషణ అనంతరం తెలిసిన విషయం ఏమిటంటే.. బాధిత కుటుంబాలకు చేరిన అవశేషాలు వారి సోదరులు లేదా బంధువులకు సంబంధించినవి కావన్న నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. డీఎన్ఏ పరీక్షలు ఎయిర్ ఇండియా కాదు,అహ్మదాబాద్ ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ నిర్వహించింది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ లేదా అవి కుటుంబాలకు అప్పగించే అంశాల్లో ఎయిర్ ఇండియాకు ప్రత్యక్ష ప్రమేయం లేదని సమాచారం.

వివరాలు 

ఆరోపించిన మృతదేహాల గురించి అధికారిక ధ్రువీకరణ జారీ చేయలేదు

శవపేటికలను కెన్యాన్ అనే అంతర్జాతీయ అత్యవసర సేవల సంస్థ ద్వారా,ఎయిర్ ఇండియా కార్గో ద్వారా యూకేకు తరలించారు. దీనిపై ప్రస్తుతం ఎయిర్ ఇండియా లోపంగా ఏమైనా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. అయితే, ఆరోపించిన మృతదేహాల గురించి అధికారిక ధ్రువీకరణ జారీ చేయలేదు. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ గాట్‌విక్ దిశగా ప్రయాణిస్తున్న AI171విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది. ఈఘోరమైన ప్రమాదంలో విమానంలోని ఒకరు తప్ప మిగతా వారు దుర్మరణం పాలయ్యారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 242మంది ప్రయాణికులు ఉండగా,వీరిలో 53మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు. చనిపోయిన బ్రిటిష్ పౌరుల్లో చాలామందికి అంత్యక్రియలు భారతదేశంలోనే నిర్వహించగా,మిగతా 12 మృతదేహాలను యూకేకు పంపించారు.