
Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. బోయింగ్‌పై అమెరికాలో దావా
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన నాలుగు కుటుంబాలు అమెరికాలో విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌పై దావా వేశాయి. ఆ పిటిషన్‌లో బోయింగ్‌తో పాటు విడిభాగాల సరఫరాదారు హనీవెల్ సంస్థ పేరును కూడా చేర్చారు. ఈ కుటుంబాలు మంగళవారం దాఖలు చేసిన కేసులో.. ప్రమాదానికి కారణం విమానంలో అమర్చిన ఇంధన స్విచ్‌లు లోపభూయిష్టంగా ఉండటమేనని స్పష్టం చేశాయి. 787 డ్రీమ్‌లైనర్ నమూనా రూపకల్పన సమయంలోనే,అలాగే విడిభాగాల అభివృద్ధి దశలోనే లోపాలున్నాయని బోయింగ్‌కు తెలుసని.. అయినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. "విమాన ఇంధన సరఫరా వ్యవస్థ, థ్రస్ట్ నియంత్రణ పద్ధతుల్లో మౌలికమైన డిజైన్ లోపాలున్నాయి" అని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివరాలు
స్పందన ఇవ్వని బోయింగ్, హనీవెల్ సంస్థలు
అంతేకాదు.. ఎప్పుడైనా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు బోయింగ్, హనీవెల్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని బాధిత కుటుంబాలు స్పష్టం చేశాయి. ఇంధన స్విచ్‌లకు క్రమం తప్పని తనిఖీలు, మరమ్మతులు అవసరమనే విషయాన్ని విమానయాన సంస్థలకు ముందుగానే తెలియజేయలేదని, అలాగే వాటిని మార్చడానికి కావలసిన విడిభాగాలను సరఫరా చేయడంలో విఫలమయ్యారని దావాలో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై బోయింగ్, హనీవెల్ సంస్థలు ఇంతవరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
వివరాలు
టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన విమానం
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా, ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో.. ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడమే ప్రమాదానికి కారణమని తేల్చింది. అయితే, బోయింగ్ విమానాల్లో అమర్చిన ఇంధన నియంత్రణ స్విచ్‌లు సక్రమంగానే పనిచేస్తున్నాయని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎఎ) తన వైఖరిని వెల్లడించింది.