Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 విమాన సర్వీసుల రద్దు
చికాగో సహా అమెరికాలోని వివిధ నగరాలకు విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం, భారీ నిర్వహణ సమస్యలు, సప్లై చైన్ పరిమితులు కారణంగా కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు తిరిగి సేవలో చేరకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. కస్టమర్లకు ముందుగా సమాచారం అందించిన ఎయిర్ ఇండియా, ఇతర సమీప రోజుల్లో వేరే సర్వీసుల్లో ప్రత్యామ్నాయ ప్రయాణ సదుపాయాలను కల్పించింది. నవంబర్ 15 నుండి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, నెవార్క్, న్యూయార్క్ మార్గాల్లో 60 సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా తెలిపింది.
ఎయిర్ టెల్
ఇందులో ఢిల్లీ-చికాగో రూట్‌లో 14, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్‌లో 28, ఢిల్లీ-ఎస్‌ఎఫ్‌వో రూట్‌లో 12, ముంబై-న్యూయార్క్ రూట్‌లో నాలుగు, ఢిల్లీ-నెవార్క్ రూట్‌లో రెండు సర్వీసులు ఉన్నాయి. విమానాలు నిర్వహణ కోసం ఎంఆర్ఓ ఆపరేటర్ వద్ద ఉండడం, కొన్ని వైడ్ బాడీ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల కొరత ఏర్పడిందని సంస్థ వివరించింది. ఈ సర్వీసుల రద్దు ప్రభావిత ప్రయాణికులకు ఎయిర్ ఇండియా పూర్తి రీఫండ్ తో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అందిస్తోంది.