Gaza-Israel War: గాజాలో వైమానిక దాడి.. 29 మంది మృతి
ఇజ్రాయెల్-పాలస్తీనా ప్రాంతంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వైమానిక దాడులు గాజాలో మరింత నాశనాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 29 మంది మరణించారని పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు ధ్రువీకరించారు. దాడుల్లో ఆస్పత్రి సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అక్టోబర్ 7, 2023న హమాస్‌తో ఇజ్రాయెల్‌పై జరిపిన హఠాత్తు దాడుల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ దాడిలో హమాస్ అనేక ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లడం, ఈ ఘటనతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను ప్రారంభించడం ఘటనల శ్రేణికి తెరతీశాయి.
గాజాలో పరిస్థితి మారటం లేదు
ఆ నాటి నుంచి గాజా తీవ్రంగా ప్రభావిమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు వేలాది మంది పాలస్తీనీయులు చనిపోయారు. అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి, ప్రజలు ఆశ్రయం కోల్పోయి వలసలు మోహరించాల్సి వస్తోంది. ఇక లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు చర్చల ద్వారా కొంత మలించుకున్నాయి. అయితే గాజాలో పరిస్థితి మారటం లేదు. ఇజ్రాయెల్ తమ బందీలను విడిపించుకోవడమే కాకుండా హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా ఉంచుకుని యుద్ధం కొనసాగిస్తోంది. ఈ యుద్ధ పరిస్థితుల్లో సామాన్య ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. వలసలు, జీవనాధారాలను కోల్పోవడం, నిరాశ్రయులు కావడం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అనేది ఇంకా స్పష్టత లేదు.