LOADING...
Viral video: ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్'లో ప్రవేశించిన విమానం.. వీడియో వైరల్
ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్'లో ప్రవేశించిన విమానం.. వీడియో వైరల్

Viral video: ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్'లో ప్రవేశించిన విమానం.. వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లోరిడాలో హరికేన్ 'మిల్టన్' ప్రభావం తీవ్రంగా గజగజ వణుకుతోంది. ఈ తరుణంలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన పరిశోధనా విమానం ప్రమాదవశాత్తు ఈ హరికేన్‌లోకి ప్రవేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను NOAA సోషల్ మీడియాలో విడుదల చేయగా, అది వైరల్‌గా మారింది. 'మిస్ పిగ్గీ'గా పిలువబడే లాక్‌హీడ్ WP-3D ఓరియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతంలోకి దూసుకుపోయింది. విమానంలో నలుగురు పరిశోధకులు ఉన్నారు, తుపానుకి గురైనప్పుడల్లా విమానం తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. పరిశోధకులు శ్రమించి విమానాన్ని తిరిగి నియంత్రించడంతో ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు.

Details

అమెరికా ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకర తుపాన్లలో ఒకటి

ఇంకా, హరికేన్ 'మిల్టన్' కారణంగా ఫ్లోరిడాలో గంటకు 290 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అధికారులు ఈ హరికేన్‌ను కేటగిరి 5గా ప్రకటించారు. పౌరులకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ తుపాను వందేళ్లలో అమెరికా ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకర తుపాన్లలో ఒకటి కావచ్చు అని వ్యాఖ్యానించారు.