
Sheikh Hasina: 'అల్లా ఓ కారణం కోసం నన్ను ప్రాణాలతో ఉంచారు'.. మద్దతుదారులతో షేక్ హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
అయితే, ఆమె తన పార్టీ నాయకులతో సమావేశమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఇప్పుడు ఉగ్రవాద దిశగా వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లా తాను బతికేలా చేసినది ఒక ముఖ్యమైన లక్ష్యం కోసం అని చెప్పిన హసీనా, అవామీ లీగ్ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నవారికి శిక్షించే రోజు తప్పకుండా వస్తుందన్నారు.
వివరాలు
స్వలాభం కోసమే మొహమ్మద్ యునుస్ పనిచేశారు
ప్రస్తుత బంగ్లాదేశ్ చీఫ్ మొహమ్మద్ యునుస్‌ను ఆమె తీవ్రంగా విమర్శించారు.
ప్రజలపట్ల ఆయనకు మమకారం లేదని, స్వలాభం కోసమే పనిచేశారని ఆరోపించారు.
తక్కువ మొత్తంలో ధనాన్ని అధిక వడ్డీతో అప్పుగా ఇచ్చి, ఆ డబ్బును విదేశాల్లో లగ్జరీ జీవితం కోసం వినియోగించారని చెప్పారు.
ఆయన అసలు యదార్థ స్వరూపం అర్థమయ్యేందుకు కొంతకాలం పట్టిందని, ఆ సమయంలో ఆయనకు మద్దతు ఇచ్చామని కూడా గుర్తు చేశారు.
అయితే చివరికి ఆయన కార్యకలాపాల వల్ల ప్రజలకు ఏ ప్రయోజనం కలగలేదని, తన ప్రయోజనాలకే పని చేశారని చెప్పారు.
అధికారం పై మక్కువతో ఆయన దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
వివరాలు
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మీడియాపై తీవ్రమైన ఆంక్షలు
ఒకప్పుడు అభివృద్ధి కోసం ఆదర్శంగా నిలిచిన బంగ్లాదేశ్, ఇప్పుడు తీవ్రవాద చర్యలతో దేశంగా పరిగణించబడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీ నాయకులను చీకటి విధానాల్లో హతమారుస్తున్నారని, అవామీ లీగ్ కార్యకర్తలు, పోలీసులు, న్యాయవాదులు, పాత్రికేయులు, కళాకారులు వంటి వారు లక్ష్యంగా మారుతున్నారన్నారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మీడియాపై తీవ్రమైన ఆంక్షలు అమలులో ఉన్నాయనీ, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు వంటి నేరాలపై ఎలాంటి వార్తలు బయటకు రావడంలేదని తెలిపారు.
ఒకవేళ అలాంటి నేరాల గురించి మీడియా వెలుగులోకి తేవాలంటే, ఆ టీవీ ఛానళ్లు, వార్తాపత్రికలే దాడులకు గురవుతున్నాయని హసీనా పేర్కొన్నారు.