Page Loader
Iron Dome: ఐరన్‌ డోమ్‌ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్‌ ప్రకటన
ఐరన్‌ డోమ్‌ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్‌ ప్రకటన

Iron Dome: ఐరన్‌ డోమ్‌ తయారీకి అమెరికా సిద్ధం.. ట్రంప్‌ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ ఆయుధ వ్యవస్థ గురించి మాట్లాడితే, తొలి గుర్తుకు వచ్చే విధానం దుర్భేద్యమైన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ. ఇది ప్రత్యర్థుల క్షిపణులను అడ్డుకునేందుకు టెల్‌అవీవ్‌ ఉపయోగించే ఉక్కు కవచంలా పనిచేస్తుంది. ఈ విధానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా కూడా సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వ్యవస్థ అత్యవసర నిర్మాణాన్ని అవసరమని పేర్కొన్నారు. త్వరలోనే ఆ దస్త్రంపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. 2006లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలో వేల రాకెట్లు టెల్‌అవీవ్‌పై ప్రయోగించారు. ఈ సమయంలో ప్రాణనష్టాలు చోటుచేసుకున్నాయి.

Details

యుద్ధ విమానాలను ఐరన్ డోమ్ కీలక పాత్ర

ఆ సమయంలోనే ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థను రూపొందించుకునేందుకు నిర్ణయం తీసుకుంది, దీనికి అమెరికా సంపూర్ణ సాయం అందించింది. ఫలితంగా 2011 నాటికి ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థ మూడు దశల్లో పనిచేస్తుంది. ఇందులో యారో-2, యారో-3 సిస్టమ్స్‌ బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఈ వ్యవస్థలు అంతరిక్షంలో బాలిస్టిక్‌ క్షిపణులను పేల్చి, వాటి శకలాలను ముప్పు నుండి దూరం చేస్తాయి. ఇవి 100-200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ఎదుర్కొనడంలో ఉపయోగపడతాయి. అలాగే యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చివేయడంలో ఐరన్‌ డోమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది.