Page Loader
Kamala Harris: 'ఓటమిని అంగీకరిస్తున్నా.. కానీ..,పోరాటం కొనసాగుతుంది: కమలా హారిస్ 
'ఓటమిని అంగీకరిస్తున్నా.. కానీ..,పోరాటం కొనసాగుతుంది: కమలా హారిస్

Kamala Harris: 'ఓటమిని అంగీకరిస్తున్నా.. కానీ..,పోరాటం కొనసాగుతుంది: కమలా హారిస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2024
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించినా, పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని అన్నారు. ఓటమి అనంతరం ఆమె తొలిసారి ఫలితాలపై స్పందిస్తూ, వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీలో తన మద్దతుదారులతో మాట్లాడారు. "స్వేచ్ఛ కోసం కృషి చేయాల్సి ఉంది. దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదే" అని తెలిపారు.

వివరాలు 

పోటీ పడ్డ తీరుపై గర్వంగా ఉంది: కమలా 

"ఇది మనం ఆశించిన ఫలితం కాదు. దీని కోసం పోరాడలేదు. కానీ, ఈ ఫలితాన్ని అంగీకరించాలి. పోటీ పడ్డ తీరుపై గర్వంగా ఉంది. మీరు నాపై ఉంచిన నమ్మకం, దేశం పట్ల ప్రేమతో నా హృదయం నిండిపోయింది. ప్రజల స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, సమాన న్యాయం కోసం నా ప్రయాణం ఎప్పటికీ ఆగదు. కొన్నిసార్లు విజయానికి సమయం పడుతుంది. దానర్థం గెలవలేమని కాదు" అంటూ తన మద్దతుదారులతో కమలా హారిస్ ప్రసంగించారు.

వివరాలు 

మన స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన సమయం

తాజా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు అందించినట్లు, అలాగే శాంతియుత అధికార మార్పిడికి ఆయన బృందానికి సహకరిస్తామని హారిస్ తెలిపారు. "అమెరికాలో అధ్యక్షుడికి లేదా పార్టీకి కాకుండా రాజ్యాంగానికి, మనస్సాక్షికి, దేవుడికి విధేయత చూపుతాం" అని హారిస్ తెలిపారు. "ఇది మన స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన సమయం" అని ఆమె తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.