LOADING...
Joe Biden : గాజాపై దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు.. సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు
సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు

Joe Biden : గాజాపై దాడులు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు.. సంయుక్త ప్రకటన చేసిన అమెరికా సహా ప్రధాన దేశాలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 23, 2023
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇజ్రాయెల్ దేశానికి అండగా నిలిచారు. ఈ మేరకు గాజాపై దాడులు ముమ్మరం కావడంతో ఆయన స్పందించారు. గాజా నగరంపై దాడి ఇజ్రాయెల్ ఆత్మ రక్షణ హక్కు అని ఇజ్రాయెల్ మిత్రపక్షాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులకు మద్ధతుగా నిలిచాయి. రాత్రిపూట గాజాతో పాటు దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వరుస వైమానిక దాడులను ప్రారంభించింది. దీంతో జో బైడెన్ సహా ప్రధాన పాశ్చాత్య దేశాధినేతలు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికా నేతృత్వంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే హమాస్‌కు వ్యతిరేకంగా నిలిచాయి. సిరియా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని లక్ష్యాలపై ఐడీఎఫ్ దళాలు దాడులను విస్తరించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడానన్న జో బైడెన్