తదుపరి వార్తా కథనం

అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు
వ్రాసిన వారు
Stalin
Apr 28, 2023
09:42 am
ఈ వార్తాకథనం ఏంటి
శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న అమెరికాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు అలస్కాలో గురువారం కూలిపోయాయి.
ఒక్కో హెలికాప్టర్‌లో ఇద్దరు చొప్పున ఉన్నట్లు యూఎస్ ఆర్మీ అలస్కా అధికార ప్రతినిధి జాన్ పెన్నెల్ తెలిపారు. అయితే వారి గురించిన ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని ఆయన చెప్పారు.
అలాస్కాలోని హీలీకి సమీపంలో సైనిక హెలికాప్టర్లు క్రాష్ అయినట్లు ప్రతిస్పందనలు వచ్చినట్లు ఆర్మీ అలాస్కా ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, పూర్తి సమాచారం అందిన తర్వాత అన్ని వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు.
ఈ ఏడాది రాష్ట్రంలో సైనిక హెలికాప్టర్లకు సంబంధించిన ప్రమాదాల్లో ఇది రెండోది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హెలికాప్టర్లు ప్రమాదంపై ఆర్మీ అధికారుల విచారణ
2 US Army helicopters crash in Alaska on training flight https://t.co/3t5uaSy8dM
— NewsNation (@NewsNation) April 28, 2023