Page Loader
దివాళ గండం తప్పించుకున్న అగ్రరాజ్యం.. కీలక బిల్లుకి ఉభయ సభల ఆమోదం

దివాళ గండం తప్పించుకున్న అగ్రరాజ్యం.. కీలక బిల్లుకి ఉభయ సభల ఆమోదం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 02, 2023
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాగా డబ్బున్న దేశంగా పేరుగాంచిన అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు దివాలా గండం నుంచి తప్పించుకుంది. అప్పుల పరిమితి పెంపునకు సంబంధించిన కీలక బిల్లుకి యూఎస్ ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. రిప్రసెంటేటివ్ సభలో బిల్లు గట్టెక్కగా, అమెరికా కాలమానం ప్రకారం గురువారం సెనేట్‌ కూడా ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా అప్పుల పరిమితి పెంచుకునేందుకు యూఎస్ సర్కార్ కు అవకాశం దొరికినట్టైంది. బిల్లుపై ప్రెసిడెంట్ బైడెన్‌ సంతకం లాంఛనమే కాబట్టి బిల్లు వెంటనే చట్టంగా మారనుంది. ప్రస్తుతానికి అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉండగా, దీన్ని ఇంకా పెంచుకునేందుకు బైడెన్‌ సర్కార్ ముందడుగు వేస్తూ కాంగ్రెస్‌ అనుమతి కోరగా ఫైనల్ గా గట్టెక్కింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం