కెనడా నిప్పుతో చెలగాటమాడటం ఆడుతోందని అమెరికా చురకలు.. వాషింగ్టన్ జోక్యం వద్దని నిపుణుల సూచన
భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలపై అమెరికా ఖండించింది. అగ్రరాజ్యంతో పాటు యూకే, ఆస్ట్రేలియా దేశాలు తీవ్ర వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. కెనడాలో ఖలిస్థానీ అనుకూల వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆ దేశపు ప్రధాన మంత్రి చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేకెత్తిస్తోంది. మరోవైపు భారతదేశంపై ఆరోపణలపై స్పందించిన కెనడా, నిప్పుతో చెలగాటమాడుతోందని అమెరికా విదేశాంగ శాఖ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయంలో వాషింగ్టన్ నాయకత్వం జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు. ఖలిస్థానీల ఉగ్రవాద చర్యలను కెనడా పెంచి పోషిస్తోందని, భారత్ వాదిస్తోంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు చేజారిపోయాయి.
జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఆందోళనకరమన్న ఆస్ట్రేలియా
హడ్సన్ శిక్షణ కేంద్రంలో జరిగిన చర్చలో మాట్లాడిన నిపుణులు, ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్నారని, ఇందులో ట్రూడో కీలుబొమ్మగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖలిస్థానీ నేత హత్య కేసులో భారత్‌ను అభాసుపాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇందులో అమెరికన్ నేతలు జోక్యం వద్దని భావిస్తున్నామన్నారు.కెనడా నిప్పుతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహించారు. కెనడా ఆందోళనకర వ్యాఖ్యలపై దర్యాప్తు కొనసాగుతోందని యూఎన్ఓలో ఆస్ట్రేలియా పేర్కొంది. భాగస్వామ్య పక్షాలతో కలిసి ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పింది. భారత్‌తోనూ ఈ విషయాన్ని పంచుకున్నామని, ఇంతకంటే మాట్లాడలేమని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ చెప్పారు. కెనడా వ్యాఖ్యలు ఆందోళన పెంచుతున్నాయని, యూకే సర్కారుతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ అన్నారు.