Page Loader
United States : అమెరికాలో బుల్లెట్ల కలకలం.. పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు
United States : అమెరికాలో బుల్లెట్ల కలకలం.. పిల్లల డైపర్'లో ఎన్ని గుండ్లు ఉన్నాయంటే

United States : అమెరికాలో బుల్లెట్ల కలకలం.. పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 21, 2023
07:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈమేరకు లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో డిసెంబర్ 20న డిస్పోజబుల్ బేబీ డైపర్‌లో 17 బుల్లెట్‌లు దాచి ఉంచినట్లు భద్రతా అధికారులు కనుగొన్నారు. ఈ క్రమంలోనే రవాణా భద్రతా అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఎక్స్-రే మెషీన్‌లో అలారం మోగడంతో అధికారులు ప్రయాణీకుల క్యారీ-ఆన్ బ్యాగ్ నుంచి ఓ డైపర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు TSA వివరించింది. బుల్లెట్స్'తో నింపిన డైపర్ తన బ్యాగ్‌లో ఎలా చేరిందో తనకు తెలియదని ప్రయాణీకుడు మొదట వాదించినా ఆ తర్వాత తన స్నేహితురాలే అలా ఉంచమని చెప్పినట్లు పేర్కొన్నాడు. TSA ప్రయాణికుడిని అమెరికా చికాగో మిడ్‌వే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు టిక్కెట్ తీసుకున్న అర్కాన్సాస్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెరికాలో బుల్లెట్ల కలకలంPost