Hamas Israel War :హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. టెల్ అలీవ్‌కు విమానాలు నిలిపివేత
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో మళ్లీ మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పై ప్రతీకార చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లోడర్ ఖమేనీ ఆదేశాలిచ్చిచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్‌ను విడిచిపెట్టమని హమస్థ సంస్థ కూడా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్- దిల్లీ మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుత కారణాల దృష్ట్యా విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎమిర్ ఇండియా స్పష్టం చేసింది.
గతంలో ఐదు నెలల పాటు నిలిపివేత
పరిస్థితులను సమీక్షించిన తర్వాత సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇక ఆగస్టు 8వ తేదీ వరకు దిల్లీ నుంచి టెల్ అవీవ్ మధ్య ప్రయాణించడానికి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపు ఉంటుందన్నారు. ఏదైనా సమాచారం కోసం 011-69329333, 011-69329999 నంబర్‌ను ఎయిర్ ఇండియా యజమాన్యం తెలిపింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత గతంలో ఐదు నెలల పాటు టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను ఎయిర్ లైన్ నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాత్కాలికంగా నిలిపివేసింది.