
Canada: ఖలిస్తానీ హత్యల వెనుక అమిత్ షా హస్తం.. కెనడా మంత్రి సంచలన ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై చర్యలకు భారత హోం మంత్రి అమిత్ షా ప్లాన్ చేసినట్టు కెనడా సంచలన ఆరోపణలు చేసింది.
ప్రధాని మోదీకి సన్నిహితుడైన అమిత్ షా, సిక్కు వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకున్నారని ఆ దేశం పేర్కొంది. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది.
ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకునే విషయంలో అమిత్ షా పాత్ర లేదని, కెనడా చేస్తున్న ఆరోపణలు అసత్యమని కేంద్రం స్పష్టం చేసింది.
కెనడా విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ అమెరికా అధికారులకు ఈ సమాచారం చేరవేశారు.
Details
కెనడా, భారత్ మధ్య ముదురుతున్న సంబంధాలు
ఈ విషయంపై అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌లో ఓ కథనం ప్రచురితమైంది.
పార్లమెంట్‌లో జరిగిన ప్యానెల్ సమావేశంలో మారిసన్ మాట్లాడుతూ, ఒక జర్నలిస్ట్ తమ సమావేశంలో "అమిత్ షానే ఆ వ్యక్తినా?" అని అడిగినప్పుడు, తాను "అవును" అని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో భారత్, కెనడాల మధ్య సంబంధాల్లో మరింత తీవ్రతమయ్యాయి.