
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈరోజు ఉదయం భూమి కంపించిందని సమాచారం.
రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. అయితే భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళవారం ఉదయం రివర్టన్ తీరానికి సమీపంలో ఈ శక్తివంతమైన భూకంపం చోటుచేసుకుంది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంప తీవ్రత 6.5 నుంచి 6.8 మధ్య ఉండే అవకాశముందని పేర్కొన్నారు.
భూకంప కేంద్రం భూమికి పశ్చిమ నైరుతి దిశలో 159 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
భూప్రకంపనలతో సంబంధిత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వివరాలు
ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు
భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. భయంతో వారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టినట్లు సమాచారం.
ఇది సున్నితమైన భూకంప జోన్‌లో సంభవించినందున తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ అనూహ్య పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
An earthquake with a magnitude of 6.5 on the Richter Scale hit Off the West Coast of South Island, New Zealand, at 07.13 IST today.
— ANI (@ANI) March 25, 2025
(Source - National Center for Seismology) pic.twitter.com/OAiVCCBcH0