'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూఎస్‌లో ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీకి ఓ భారతీయులు వినూత్నంగా స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. నంబర్ ప్లేటుపై మోదీ పేరును ఉన్న కారు ఆయన ప్రదర్శించేదుకు రెడీ అవుతున్నారు. వర్జీనియాలోని మేరీలాండ్ నివసిస్తున్న రాఘవేంద్ర తన కారు నంబర్ ప్లేట్‌పై 'NMODI' పేరు ఉండేలా రిజస్ట్రేషన్ చేయించుకున్నారు. మోదీ అంటే రాఘవేంద్రకు చాలా ఇష్టం. అందుకు తన ప్రేమను రాఘవేంద్ర ఇలా చాటుకున్నారు.
ప్రధాని మోదీ నాకు స్ఫూర్తి: రాఘవేంద్ర
తన కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరును ఉండటంపై రాఘవేంద్ర స్పందిచారు. ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అని అన్నారు. నేను ఈ నంబర్ ప్లేట్‌ను 2016 నవంబర్‌లో తీసుకున్నట్లు చెప్పారు. దేశం కోసం, సమాజం కోసం, ప్రపంచం కోసం ఏదైనా మంచి చేయాలని విషయంలో మోదీ తనకు స్ఫూర్తి అని రాఘవేంద్ర చెప్పారు. ప్రధాని మోదీ అమెరికాకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలకడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాఘవేంద్ర వెల్లడించారు. ప్రధాని మోదీ యూఎస్ పర్యటనలో భాగంగా అమెరికాలో కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. అనేక మంది అమెరికన్ రాజకీయ నాయకులు, ప్రముఖులను కలుస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు.