
Zohran Mamdani: చరిత్ర సృష్టించే అవకాశం.. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతి నేత!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని న్యూయార్క్ మేయర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం జరిగిన రేసులో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) విజయం సాధించారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ర్యాంక్డ్ ఛాయిస్ కౌంట్ పద్ధతిలో అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని ప్రకటించారు.
Details
ఎన్నికల్లో స్వతంత్రగా అభ్యర్థిగా ఎరిక్ ఆడమ్స్
తన మేయర్ అభ్యర్థిత్వం గెలిస్తే, జోహ్రాన్ మమదానీ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం, భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇక ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే పలు అవినీతి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎరిక్ ఆడమ్స్‌కు న్యూయార్క్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సమాచారం. నవంబరులో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమదానీ ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో తలపడనున్నారు.