Page Loader
Bishnoi gang : బిష్ణోయ్ గ్యాంగ్ కు టెర్రర్ ట్యాగ్ కావాలని కోరుతున్న నార్త్ కెనడియన్ నాయకుడు 
బిష్ణోయ్ గ్యాంగ్ కు టెర్రర్ ట్యాగ్ కావాలని కోరుతున్న నార్త్ కెనడియన్ నాయకుడు

Bishnoi gang : బిష్ణోయ్ గ్యాంగ్ కు టెర్రర్ ట్యాగ్ కావాలని కోరుతున్న నార్త్ కెనడియన్ నాయకుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నేర కార్యకలాపాలు కెనడాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయనీ, హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పలు హత్యలతో కూడిన కార్యకలాపాల్లో ఈ గ్యాంగ్ పాల్గొంటోందని కెనడియన్‌ నేత డేనియల్ స్మిత్ స్పష్టం చేశారు. ఈ ముఠాకు అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌ ఉందని, అందుకే దీనిని ఉగ్రవాద సంస్థగా గుర్తించి 'టెర్రర్ ట్యాగ్' పెట్టాలని ఆయన తన సోషల్ మీడియా పోస్టులో కోరారు. బిష్ణోయ్ ముఠా లక్ష్యం పూర్తిగా నేరపూరితమైందనీ, హింసతో కూడుకున్నదనీ ఆ పోస్టులో స్మిత్ పేర్కొన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు ఎలాంటి పరిమితులు లేవని,దేశంలో ఇలాంటి ముఠాలకు స్థానం లేకపోవాలన్నారు.

వివరాలు 

బిష్ణోయ్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఉన్న గోల్డీ బ్రార్‌పై చర్యలు తీసుకోవాలన్న భారత్

ఈ గ్యాంగ్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే,వారి కార్యకలాపాలకు ఆంక్షలు విధించవచ్చనీ, ప్రాంతీయ చట్ట అమలు సంస్థల పనులకు అంతరాయం ఏర్పడకుండా ఉంటుందని డేనియల్ స్మిత్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, బిష్ణోయ్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఉన్న గోల్డీ బ్రార్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ గతంలోనే కెనడాకు విజ్ఞప్తి చేసింది. గత జూన్‌లో బ్రిటిష్ కొలంబియా రాష్ట్ర నేత డేవిడ్ ఎబీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అల్బెర్టా, ఒంటారియో ప్రాంతాల్లో నివసిస్తున్న దక్షిణాసియా వాసులపై లారెన్స్ బిష్ణోయ్ ముఠా పలు నేరాలు చేసినట్టు ఆయన ఆరోపించారు.

వివరాలు 

సర్రే మేయర్ బ్రెండా లాక్ కూడా ఈ పిలుపుకు మద్దతు 

ఇదే సమయంలో సర్రే మేయర్ బ్రెండా లాక్ కూడా ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే, కెనడాలో చట్ట అమలు సంస్థలు నిర్వహించే నేర నియంత్రణ చర్యలకు మరింత బలం చేకూరుతుందని, వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లను ఎదుర్కోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.