Page Loader
BLA: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!
పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!

BLA: పాకిస్థాన్‌కు మరో షాక్‌.. సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అనుకూలమైన అవకాశాల్ని వదులుకోకుండా వరుసగా దాడులు జరుపుతూ, పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పాక్ లోని అనేక ప్రాంతాల్లో ప్రభావాన్ని పెంచుకున్న బీఎల్ఏ.. తాజాగా మరో కీలక విజయాన్ని సాధించింది. తాజాగా పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సురబ్ జిల్లాను BLA సాయుధ యోధులు స్వాధీనం చేసుకున్నారు. సురబ్ పట్టణంలోని లెవీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఒక బ్యాంకు సహా అనేక కీలక ప్రాంతాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించింది. పెద్ద సంఖ్యలో సాయుధ సభ్యులు నగరానికి ప్రవేశించి, క్వెట్టా-కరాచీ, సురబ్-ఘిదర్ హైవేలు పైన సోదాలు నిర్వహిస్తున్నారు.

Details

ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం

దీంతో ఆ ప్రాంతం మొత్తం ఉద్రిక్తతతో కప్పుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంతో సంబంధాలు దాదాపుగా పూర్తిగా తెగిపోయాయి. ఇంకా పాక్ ప్రభుత్వం గానీ, భద్రతా సంస్థలు గానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అయితే BLA ప్రతినిధి జియాంద్ బలోచ్ మాట్లాడుతూ.. "సురబ్ పట్టణాన్ని మా యోధులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. లెవీస్, పోలీస్ స్టేషన్‌లు, బ్యాంకులు ఇప్పుడు మా నియంత్రణలో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు అదనపు డిప్యూటీ కమిషనర్ (ADC) హిదాయత్ ఉల్లాను బీఎల్ఏ సభ్యులు ఓ గదిలో బంధించారని, ఊపిరాడక మరణించాడని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో సురబ్ నగరంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ సంఘటన పాక్ భద్రతా వ్యవస్థపై మరోసారి తీవ్ర ఆందోళనను కలిగించింది.