LOADING...
Pakistan: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి
పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి

Pakistan: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

వాయవ్య పాకిస్థాన్‌లోని బన్నూ పట్టణంలోని సైనిక కంటోన్మెంట్‌పై మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 30 మంది గాయపడినట్లు సమాచారం. మరోవైపు జరిగిన ఇతర ఘటనల్లో పాక్‌ సైన్యం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చింది. తీవ్రవాదులు పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్నూ కంటోన్మెంట్‌ గోడలను ఢీకొన్నారని, ఘటనాస్థలం పెషావర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని ఖైబర్‌ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో ఉందని పోలీసులు వెల్లడించారు. హాఫిజ్‌ గుల్‌ బహాదుర్‌ నేతృత్వంలోని జైష్‌ అల్‌ ఫుర్సాన్‌ తీవ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌-పాకిస్థాన్‌కు చెందిన అనేక చీలికవర్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

Details

ఈ ఘటనను ఖండించిన సీఎం

ఆత్మాహుతి వాహనాల ఢీకొట్టిన కారణంగా సంభవించిన భారీ పేలుడు ధాటికి కంటోన్మెంట్‌ సమీపంలోని సాధారణ పౌర ఆవాస భవనాల్లో ఐదుగురు మరణించారు. మరో నలుగురు మృతదేహాలను కంటోన్మెంట్‌ సమీపంలో ధ్వంసమైన మసీదు శిథిలాల నుంచి వెలికితీశారు. ఈ దాడిని ఖైబర్‌ పఖ్తూంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ గండాపుర్‌ తీవ్రంగా ఖండించారు. పవిత్ర రంజాన్‌ నెలలో ఈ ఘటన జరగడం అత్యంత విషాదకరమని ఆయన వ్యాఖ్యానించారు.