NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan : పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Pakistan : పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి
    పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి

    Pakistan : పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలోపడి ; 20 మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 03, 2024
    11:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వాయువ్య పాకిస్తాన్‌లో శుక్రవారం కొండ ప్రాంతం నుండి ప్రయాణీకుల బస్సు లోయలో పడిపోవడంతో కనీసం 20 మంది మరణించారు.

    గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి తెలిపారు.

    బస్సు రావల్పిండి నుంచి హుంజా వెళ్తోంది.ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.

    బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై స్పష్టత లేదని అధికారి తెలిపారు.

    ఈ ఘటనలో గాయపడిన 15 మందిని చిలాస్‌లోని ఆసుపత్రికి తరలించారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారి తెలిపారు.

    మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    Details 

    ప్రమాదంపై గిల్గిత్ బాల్టిస్థాన్ సీఎం విచారం 

    ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి హాజీ గుల్బర్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు.

    గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.

    ప్రమాదం తర్వాత చిలాస్ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించామని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరక్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి

    పాకిస్థాన్

    PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం  జమ్ముకశ్మీర్
    Ishan Kishan: విరాట్, కోహ్లీ ఎప్పుడూ అలా చేయలేదు.. కానీ ఇషాన్ ఎందుకలా?: పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్  ఇషాన్ కిషన్
    Pakistan: బలూచిస్థాన్‌పై ఇరాన్ దాడులు.. తీవ్ర పరిణామాలు ఉంటాయి..ఇరాన్‌కు పాక్ హెచ్చరిక!   అంతర్జాతీయం
    Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్  న్యూజిలాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025