NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. చిన్నారి మృతి, 25 మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Pakistan: పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. చిన్నారి మృతి, 25 మందికి గాయాలు 
    పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. చిన్నారి మృతి, 25 మందికి గాయాలు

    Pakistan: పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. చిన్నారి మృతి, 25 మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    08:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది.

    ఇందులో ఒక చిన్నారి మరణించగా, సుమారు 25 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన పెషావర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని స్వాబీ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.

    సెంట్రల్ పోలీస్ కార్యాలయానికి అందిన ప్రాథమిక నివేదికల ప్రకారం, పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తులోని డిపోలో 'షార్ట్ సర్క్యూట్ కారణంగా' పేలుడు సంభవించింది.

    రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను బచాఖాన్ మెడికల్‌కు తరలించి అక్కడ అత్యవసర పరిస్థితిని విధించారు.

    పలువురికి గాయాలయ్యాయని, భవనం పైభాగం కూలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.ఈ పేలుడులో ఒక చిన్నారి చనిపోగా, మరో 25 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

    వివరాలు 

    ఉగ్రవాద దాడి కాదు

    పేలుడు కారణంగా భవనంలో మంటలు చెలరేగాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

    పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఉగ్రదాడి కాదని పఖ్తున్‌ఖ్వా ప్రావిన్షియల్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

    అధికారి ప్రకారం, 'బయట సురక్షితమైన స్థలంలో పారవేయబడినప్పటికీ, అనేక ఆపరేషన్లలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు పనిచేయకపోవడం వల్ల ప్రమాదవశాత్తు పేలాయి.'

    ఇప్పటి వరకు 12 మంది క్షతగాత్రులను శిథిలాల నుంచి బయటకు తీశామని, ఇంకా క్షతగాత్రులను గుర్తించే అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు చెబుతున్నారు.

    పేలుడు ఘటనలో చిన్నారి మృతి పట్ల ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ గండాపూర్‌ విచారం వ్యక్తం చేశారు.

    మృతి చెందిన చిన్నారి కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పాకిస్థాన్

    Pakistan new PM: పాకిస్థాన్ కొత్త ప్రధానిగా నవాజ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి
    Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం  తుపాకీ కాల్పులు
    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Pakistan: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025