USA: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. బాధ్యులపై చర్యల కోసం భారత్ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినో హిల్స్‌లోని బాప్స్ స్వామినారాయణ్ మందిరంపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి దానిని దెబ్బతీశారు.
ఆలయ అధికారులు ఈ ఘటనను ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ దుశ్చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.
కాలిఫోర్నియాలోని చినో హిల్స్ హిందూ దేవాలయంపై దాడి వార్తలను గమనించాం. ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఈ ఘటనకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రార్థనా స్థలాలకు తగిన భద్రతను కల్పించాలని కోరుతున్నామని తెలిపారు.
Details
భక్తుల ఆందోళన
గతేడాది సెప్టెంబర్‌లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి.
కాలిఫోర్నియాలోని శాఖ్రమెంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరంపై విద్వేషపూరిత రాతలు రాశారు.
అంతకుముందు న్యూయార్క్‌లోని బాప్స్ మందిరం వద్ద కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.