Page Loader
Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్‌ దాడులతో బెంబేలు
ఆస్ట్రేలియాలో వరుస సైబర్‌ దాడులు.. మొన్న కమ్యూనికేషన్లు, నేడు ఓడరేవులు

Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్‌ దాడులతో బెంబేలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 13, 2023
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో వరుసగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ఈ మేరకు తీవ్రత ఎక్కువవుతోంది.ఈ క్రమంలోనే రెండో అతిపెద్ద పోర్టు ఆపరేటర్‌ డీపీ గ్లోబల్‌ ఆస్ట్రేలియా విభాగం హ్యాకర్ల బారిన పడింది. ఫలితంగా దాదాపు 3 రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. తాజాగా వాటిని పునరుద్ధరించారు. మరోవైపు అతిపెద్ద పోర్టు ఆపరేటర్‌ సైతం సైబర్‌ దాడికి గురైంది. ఈ సంస్థ వెబ్‌సైట్లు కొన్ని రోజుల పాటు మూతపడ్డాయని ఆస్ట్రేలియన్ ప్రభుత్వ ఆధికారులు ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా ఎగుమతులు, దిగుమతుల్లో సుమారు 40 శాతం సరుకుల సముద్ర రవాణాను డీపీ వరల్డ్‌ సంస్థ నిర్వహిస్తోంది. దేశ ప్రధాన పోర్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆస్ట్రేలియన్ పోర్ట్, దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

details

కీలక నెట్‌వర్క్‌ల నుంచి ఇంటర్నెట్‌ నిలిపివేత : ఆస్ట్రేలియా విభాగం

ఈ సంస్థ ఆధీనంలోనే మెల్‌బోర్న్‌,సిడ్నీ,బ్రిస్బేన్‌,పెర్త్‌, ఫ్రెమాంట్లె ప్రధాన పోర్టుల టెర్మినల్స్ ఉన్నాయి. సైబర్ నేరంతో సరుకు ఎగుమతులు,దిగుమతులపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలు భారీ నౌకలు అన్‌లోడింగ్‌ కాకుండానే తీరంలో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, కస్టమర్లు, నెట్‌వర్క్‌ వ్యవస్థల సంరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు డీపీ గ్లోబల్‌ ఆస్ట్రేలియా విభాగం వెల్లడించింది.కీలక నెట్‌వర్క్‌ల నుంచి ఇంటర్నెట్‌ నిలిపివేశామని వివరించింది. తాజాగా డీపీ వరల్డ్‌ సంస్థ అన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లోకి రావడం గమనార్హం. బాధిత సంస్థ దాడుల నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు సంస్థ సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ డారెన్‌ గోల్డీ తెలిపారు. పోర్టుల్లో శుక్రవారమే ఇంటర్నెట్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపేశామని డీపీ వరల్డ్‌ ప్రకటించింది. అనధికారిక కార్యకలాపాల నియంత్రణ కోసమేనని స్పష్టం చేసింది.