Page Loader
Right to Disconnect:ఆస్ట్రేలియాలో కొత్త 'డిస్‌కనెక్ట్ హక్కు'చట్టం.. ఉద్యోగులకు రక్షణ 
ఆస్ట్రేలియాలో కొత్త 'డిస్‌కనెక్ట్ హక్కు'చట్టం

Right to Disconnect:ఆస్ట్రేలియాలో కొత్త 'డిస్‌కనెక్ట్ హక్కు'చట్టం.. ఉద్యోగులకు రక్షణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 23, 2024
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోమవారం నుండి ఉద్యోగుల సంరక్షణకు కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువస్తోంది. ఈ చట్టం ప్రకారం పని గంటలు పూర్తి అయ్యిన తరువాత తమ బాస్ లను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులకు వారి మొబైల్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేసే హక్కును కల్పించే ఇలాంటి చట్టాలు ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్‌లోని ఇతర దేశాలలో ఇప్పటికే అమలులో ఉన్నాయి. దీంతో వారికీ వర్క్ నుండి కాస్త దూరంగా పర్సనల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం లభించనుంది. ఈ చట్టాన్ని ఆస్ట్రేలియాలో ఫిబ్రవరిలోనే పాస్‌ చేశారు.

వివరాలు 

యూకేలో కూడా 'right to disconnect'చట్టం అమలుకు యోచన 

ఈ నూతన చట్టం ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు..పలు సంస్థలు చట్టాన్నివ్యతిరేకించి విమర్శించాయి. ఈ చర్య ఇది పూర్తిగా తొందరపాటు అని..లోపభూయిష్టమని పేర్కొన్నాయి.ఈనూతన చట్టంలో సదరు ఉద్యోగి హోదా,యజమానితో మాట్లాడేందుకు తిరస్కరణలో అసహేతుకత, సంస్థలు చెప్పే కారణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి మినహాయింపులు ఉన్నాయి. కానీ,ఈ మినహాయింపుల వల్ల చట్టం అమలు కష్టమవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఫెయిర్‌ వర్క్‌ యాక్ట్‌లోని లోపాలను పూడ్చేందుకు ఈనూతన చట్టాన్ని అమలు చేయనున్నారు. అంతేకాకుండా తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని క్రిమినలైజ్‌ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతోపాటు కంపెనీ యజమానులు ఉద్యోగులను అప్పాయింట్ చేసుకునే చట్టాల్లో కూడా మార్పులు తీసుకురానున్నారు. యూకేలో కూడా లేబర్‌ పార్టీ ప్రభుత్వం'right to disconnect'చట్టాన్ని అమలుచేయాలని చూస్తోంది.