Page Loader
Benjamin Netanyahu: బేబీ కిఫిర్ బిబాస్, అతని కుటుంబం ఇక లేరు.. నేతన్యాహు భావోద్వేగ ప్రకటన
బేబీ కిఫిర్ బిబాస్, అతని కుటుంబం ఇక లేరు.. నేతన్యాహు భావోద్వేగ ప్రకటన

Benjamin Netanyahu: బేబీ కిఫిర్ బిబాస్, అతని కుటుంబం ఇక లేరు.. నేతన్యాహు భావోద్వేగ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 19 హృదయ విచాకరమైన రోజు అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ బందీలో మరణించిన కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలను తిరిగి ఇజ్రాయెల్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. శిరి బిబాస్, ఆమె పిల్లలు అరీయెల్, కిఫిర్, ఓడెడ్ లిఫ్షిట్జ్ మరణించిన వార్తను తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్టోబర్ 7 ఉగ్రదాడిలో కిఫిర్ (9 నెలలు), అరీయెల్ (4 ఏళ్లు తల్లి శిరి బిబాస్‌ బందీలయ్యారు. వారి తండ్రి యార్డెన్‌ని కూడా వేరుగా కిడ్నాప్ చేశారు. మృతదేహాలను తిరిగి అప్పగించనున్న హమాస్ మంగళవారం హమాస్ ప్రకటించిన ప్రకారం కిఫిర్, అరీయెల్, శిరి బిబాస్, ఓడెడ్ లిఫ్షిట్జ్ మృతదేహాలను గాజాలోని ఖాన్ యూనిస్ వద్ద ఇజ్రాయెల్‌కు అప్పగించనుంది.

Details

స్పందించిన ప్రధానమంత్రి నెతన్యాహు  

నెతన్యాహు కార్యాలయం తెలిపిన ప్రకారం మృతదేహాల వివరాలను తెలుసుకున్నామని, బాధిత కుటుంబాలను ఈ సమాచారం అందించామన్నారు. ఇజ్రాయెల్‌కు ఇది ఒక కష్టమైన రోజు, అత్యంత బాధాకరమైన రోజు అని వ్యాఖ్యనించారు. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి బిబాస్ కుటుంబం హోస్టేజ్ సంక్షోభానికి ప్రతీకగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలనే డిమాండ్‌కు ఈ కుటుంబం చిహ్నంగా నిలిచింది. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న మరింతమంది ఇజ్రాయెల్ పౌరుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.