South Korea: తారాస్థాయికి చెత్త యుద్ధం.. దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంలోకి చెత్త బెలూన్స్
ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లు మళ్లి సౌత్ కొరియాలో మళ్లీ కనిపించాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా బుధవారం దక్షిణ కొరియా వైపు చెత్తతో నిండిన మరిన్ని బెలూన్‌లను పంపినట్లు సియోల్ అధికారులు తెలిపారు.
2వేల కంటే ఎక్కువ బెలూన్లను ప్రయోగించిన దక్షిణ కొరియా
బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అయితే ఈ చెత్త దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితమే సరిహద్దులో ఉత్తర కొరియాకు సంబంధించి ప్రచార సందేశాలను ప్రసారం చేయడం ద్వారా దక్షిణ కొరియా ప్రతీకారం తీర్చుకుంది. ఉత్తర కొరియా పంపిన చెత్తతో నింపిన బెలూన్లు బుధవారం సరిహపద్దు దాటి సియోల్‌కు ఉత్తరంగా పడ్డాయి. మే నెల చివరి వారం నుంచి ఈ బెల్లూన్ల యుద్ధం సాగుతోంది. ఇప్పటివరకూ 2వేల కంటే ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించినట్లు దక్షిణకొరియా సైన్యం పేర్కొంది. ఇక ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపండం ఇది పదోసారి