Page Loader
Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం
క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ..

Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
02:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. భారత్ తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి సహా పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో బలూచిస్థాన్ నుంచి కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించిన ప్రకారం, వారు పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టి, క్వెట్టా నగరాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో, పాకిస్థాన్ ఇటీవల భారత్‌లోని అనేక నగరాలపై దాడులు చేయగా, వాటిని భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత దళాలతో పాకిస్థాన్ సైన్యం యుద్ధం చేస్తున్నసమయంలోనే, బలూచ్ యోధులు క్వెట్టా ప్రాంతంలో చర్యలకు పాల్పడ్డారు.

వివరాలు 

కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌ను బలూచ్ యోధుల లక్ష్యం

క్వెట్టాలో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచ్ యోధులు ముట్టడి చేశారు. తాజా వివరాల ప్రకారం, తిరుగుబాటుదారులు క్వెట్టా నగరంపై పూర్తి నియంత్రణ సాధించారని, అక్కడ ఉన్న పాక్ సైనికులను అక్కడి నుంచి తరిమివేశారని తెలుస్తోంది. క్వెట్టాలోని జంగ్లే బాగ్ ప్రాంతంలోని కాంబ్రానీ రోడ్డులో ఉన్న కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌ను బలూచ్ యోధులు లక్ష్యంగా చేసుకున్నారు. అదే సమయంలో సమీపంలోని ఆరు ప్రాంతాల్లో పేలుళ్లను జరిపారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విధ్వంసకర చర్యలకు పాల్పడింది. జమరాన్ కట్గాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ ఆక్రమణ దళాల చెక్‌పాయింట్‌పై ఆటోమేటిక్ తుపాకులు, లాంచర్లు,బహుళ గ్రెనేడ్లతో ఘాటుగా దాడి చేశారు. ఈ దాడుల్లో వారి లక్ష్యాలను సమర్థవంతంగా చేధించగలిగారు.

వివరాలు 

బలూచీ రేడియో భారత్‌కు మద్దతు

ఇక పాకిస్థాన్‌లోని చమురు క్షేత్రాలను కూడా బలూచ్ యోధులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఈ దాడుల వలన అనేకమంది పాకిస్థాన్ సైనికులు, అలాగే కొంతమంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ దాడుల అనంతరం, పాకిస్థాన్ సైన్యం క్వెట్టా ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, భారత్ పాకిస్థాన్‌పై నిర్వహిస్తున్న దాడుల విషయాన్ని బలూచీ రేడియో ప్రత్యేకంగా హైలైట్ చేస్తోంది. అంతేకాకుండా, బలూచీ రేడియో భారత్‌కు మద్దతు కూడా ప్రకటిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ