Bangladesh: హసీనా సంతకం ఫోర్జరీ చేశారా? పాస్‌పోర్టు లేఖపై అనుమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (NID) జారీ చేయాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు లేఖ పంపించారు. అయితే ఈ లేఖలో ఉన్న హసీనా సంతకంపై వివాదం నెలకొంది. అందులోని సంతకం అసలైనది కాదని, ఫోర్జరీ చేసి ఉండవచ్చని బంగ్లాదేశ్ ప్రధాని సహాయకుడు రాషెద్ ఖాన్ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. హసీనా పాస్‌పోర్టు కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన లేఖపై దిల్లీలోని తమ హైకమిషన్ అధికారులతో చర్చించినట్లు రాషెద్ ఖాన్ వెల్లడించారు.
వివరాలు
తాజా లేఖలోని సంతకం అలా లేదు
పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ లేఖలోని సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా హసీనా తన సంతకాన్ని బెంగాలీ భాషలో చేస్తారని,అయితే తాజాగా పంపిన దరఖాస్తులో మరో భాషలో సంతకం చేసినట్లు ఉందని తెలిపారు.
ఒక వ్యక్తి సంతకం సాధారణంగా స్థిరంగా ఉండాలని రాషెద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా అధికారిక పత్రాలు,జాతీయ గుర్తింపు కార్డు(NID)లో నమోదైన సంతకంతో అది సరిపోలాల్సి ఉంటుందని వివరించారు.
కానీ తాజా లేఖలోని సంతకం అలా లేదని ఆరోపించారు.అసలు హసీనా సంతకం ఏ భాషలో ఉంటుందో లేఖ పంపించే ముందు ఆమె న్యాయవాదులు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు.
సంతకాన్నిఫోర్జరీ చేసే ప్రయత్నంలోనే ఈ పొరపాటు జరిగి ఉండవచ్చని రాషెద్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు.