Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు.. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, నిరసనకారులు దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం 'బంగా భబన్'ను చుట్టుముట్టారు. ప్రధాన మంత్రి షేక్ హసీనాను తొలగించాలని కోరుతూ విద్యార్థి సంఘం మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ దగ్గర ర్యాలీ నిర్వహించింది. అధ్యక్షుడి రాజీనామాతో పాటు ఇతర డిమాండ్లను స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా కొత్త రాజ్యాంగం
నిరసనకారులు రాత్రి 'బంగా భబన్' వైపు మార్చి వెళ్లగా, రంగంలోకి వచ్చిన సైన్యం బారికేడ్లతో వారిని ఆపేందుకు ప్రయత్నించింది. మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు భారీ సంఖ్యలో బంగా భవన్ బయట నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు షహబుద్దీన్‌ను మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి స్నేహితుడని ఆరోపిస్తూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కోరాయి. ఈ సందర్భంగా 1972 రాజ్యాంగాన్ని రద్దు చేసి, ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు.
న్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటుకి డిమాండ్
అలాగే, షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని విద్యార్థి సంఘం నేతలు కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. జూలై-ఆగస్టులో జరిగిన తిరుగుబాట్ల స్పూర్తితో రిపబ్లిక్ బంగ్లాదేశ్‌గా ప్రకటించాలని విద్యార్థులు కోరుతున్నారు. మహ్మద్ షహబుద్దీన్ ప్రస్తుతం బంగ్లాకు 16వ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అవామీ లీగ్ పార్టీ నామినేట్ చేయగా, 2023 అధ్యక్ష ఎన్నికలలో షహబుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.