
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
దేశ రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడమే ఆయన ఈ నిర్ణయానికి దారితీసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో పలు ప్రముఖ ఆంగ్ల మాధ్యమాల్లో సంబందిత కథనాలు వెలువడ్డాయి.
నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్‌సీపీ)అధినేత్రి నహీద్ ఇస్లామ్ ఈ విషయమై ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
వివరాలు
దేశ రాజకీయ పార్టీలన్నీ ఐక్యతగా లేనప్పుడు..
"యూనస్ రాజీనామా చేసే వార్తలు నాకు తెలిసాయి. ఈ విషయాన్ని చర్చించేందుకు ఆయనను కలిశాను. 'రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నాను' అని యూనస్ స్వయంగా చెప్పారు.దేశ రాజకీయ పార్టీలన్నీ ఐక్యతగా లేనప్పుడు తాను పనిచేయలేనని ఆయన స్పష్టంగా చెప్పారు. దేశ భద్రతను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బలంగా ఉండాలని నేను ఆయన్ను ప్రోత్సహించాను. అన్ని పార్టీలు ఐక్యంగా ఉండి ఆయన్ను మద్దతించాలన్నదే నా ఆశ. రాజకీయ పార్టీలకు యూనస్ పట్ల నమ్మకం లేకపోతే, ఆయన ఆ పదవిలో కొనసాగడం సాధ్యమేనా?" అని నహీద్ ప్రశ్నించారు.