Joe Biden: నేనో 'స్టుపిడ్'.. నేను ఆలా చేయలేక తప్పుచేశా : బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో తన పదవీ కాలాన్ని ముగించనున్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయ సమయంలో అమలు చేసిన ఆర్థిక విధానాలను సమర్థించుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021లో కొవిడ్ మహమ్మారి సమయంలో బాధితులకు ఇచ్చిన రిలీఫ్ చెక్స్‌పై తన పేరు రాసుకోకపోవడం తెలివితక్కువ నిర్ణయం అని తెలిపారు. బ్రూకింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగిస్తూ, 2020లో డొనాల్డ్ ట్రంప్ రిలీఫ్ చెక్స్‌పై తన పేరు రాసుకుని మంచి పేరు సంపాదించుకున్నారని, అయితే తనకు ఆ అవకాశం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. అలాగే, ట్రంప్ ఆధునిక చరిత్రలో బలమైన ఆర్థిక వ్యవస్థను పొందారని, ఆయన వైట్‌హౌస్‌లోకి వచ్చాక డెమోక్రటిక్ విధానాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలని సవాల్ విసిరారు.
విదేశీ దిగుమతులపై సుంకాలు.. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టిన బైడెన్
విదేశీ దిగుమతులపై సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ తప్పుబట్టారు. అలాగే, ట్రంప్ మద్దతుదారులు ప్రోత్సహిస్తున్న ప్రాజెక్ట్-2025ను ఆర్థిక విపత్తుగా అభివర్ణిస్తూ, భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో విసిరివేయాలని ప్రార్థన చేశారు. ప్రాజెక్ట్-2025లో ఫెడరల్ ప్రభుత్వాన్ని పూర్తిగా మార్చే లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థ, వలసలు, విద్యా విధానం, పౌరహక్కుల అంశాలను ప్రతిపాదించినా, వాటిలో చాలావరకు ట్రంప్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయని బైడెన్ పేర్కొన్నారు.