Page Loader
Elon Musk: సెనెట్‌లో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు పాస్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్!
సెనెట్‌లో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు పాస్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్!

Elon Musk: సెనెట్‌లో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు పాస్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీసుకొచ్చిన 'బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌'పై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్‌ పాలకవర్గం ప్రవేశపెట్టిన ఈ బిల్లుతోనే మస్క్, ట్రంప్‌ల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తాజాగా, సెనెట్‌లో ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు మస్క్‌ తన ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) ఖాతాలో వరుసగా పలు పోస్టులు చేశారు. ఈ బిల్లు అమెరికాలో మిలియన్ల మందికి ఉద్యోగాల నష్టం తెచ్చిపెడుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా హాని కలిగించేదిగా ఉందని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌ అనేది పరిశ్రమల భవిష్యత్తును దెబ్బతీసే విధ్వంసకర చర్యగా అభివర్ణించారు.

Details

తీవ్ర విమర్శల మధ్య సెనెట్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు ఆమోదం

అంతేకాక, ఈ బిల్లు రిపబ్లికన్ పార్టీకి రాజకీయ ఆత్మహత్యలా మారుతుందని చెబుతూ, మస్క్‌ నిర్వహించిన ఓ పోల్‌ ఫలితాన్ని కూడా తన పోస్ట్‌లో జోడించారు. అలాగే ఈ బిల్లుతో అమెరికా రుణ పరిమితి 5 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ తీవ్ర విమర్శల మధ్యే సెనెట్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును ఆమోదించింది. ఉత్కంఠభరిత ఓటింగ్‌లో 51-49 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు డెమోక్రటిక్‌ సభ్యులంతా వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినప్పటికీ, కొంతమంది రిపబ్లికన్ల మద్దతుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ పరిణామాలతో ట్రంప్‌ వర్సెస్‌ మస్క్ మధ్య వాగ్వాదం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.