LOADING...
Biological smuggling: వుహాన్ ల్యాబ్‌తో సంబంధం ఉన్న చైనా శాస్త్రవేత్త అమెరికాలో అరెస్టు 
వుహాన్ ల్యాబ్‌తో సంబంధం ఉన్న చైనా శాస్త్రవేత్త అమెరికాలో అరెస్టు

Biological smuggling: వుహాన్ ల్యాబ్‌తో సంబంధం ఉన్న చైనా శాస్త్రవేత్త అమెరికాలో అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా దేశానికి చెందిన మరో వ్యక్తి బయోలాజికల్ ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఆరోపణలపై అమెరికాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జూన్ 8, ఆదివారం నాడు అరెస్ట్ చేసిన నిందితుడిని చెంగ్క్సువాన్ హాన్‌గా గుర్తించారు. ఆమె చైనాకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థిగా, వుహాన్‌లో ఉన్న హువాజోంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో పరిశోధన చేస్తోన్న విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అమెరికాలోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ విమానాశ్రయంలో హాన్‌ను FBI అధికారులు జూన్ 8న అరెస్ట్ చేశారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, హాన్‌పై రెండు ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. బయోలాజికల్ ఆయుధాలను అమెరికాలోకి అక్రమంగా రవాణా చేయడం, అలాగే అధికారులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం అందించడం.

వివరాలు 

ప్యాకేజీలో రౌండ్‌వార్మ్‌లకు సంబంధించిన జీవసంబంధమైన పదార్థాలు

ఈ ఘటనపై FBI మాజీ అధికారి కాష్ పటేల్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ.. చైనా పౌరురాలు అయిన హాన్‌ను డెట్రాయిట్‌లో అరెస్ట్ చేశామని, ఆమె అమెరికాలోకి బయోలాజికల్ మెటీరియల్స్ అక్రమంగా తరలించి,అధికారులకు అసత్య సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆమె చైనాలోని వుహాన్‌కు చెందినవారిగా, అక్కడ పీహెచ్‌డీ చదువుతున్నట్లు పేర్కొన్నారు. అధికారుల ప్రకారం,హాన్ చైనాలోని మిచిగాన్ యూనివర్సిటీ ల్యాబ్ నుంచి నాలుగు ప్యాకేజీలను తీసుకొచ్చింది. వాటిలో ప్రతి ఒక్కదాంట్లో రౌండ్‌వార్మ్ లు అనే జీవులకి సంబంధించిన బయోలాజికల్ పదార్థాలున్నాయి. ప్రత్యేకంగా ఒక ప్యాకేజీలో ఓ పుస్తకం దాచి పెట్టినట్లు గుర్తించారు. అమెరికాలో డెట్రాయిట్‌లో దిగిన తర్వాత నిందితురాలు . సదరు ప్యాకేజీల గురించి తనకు తెలియదని బుకాయించింది.

వివరాలు 

 చైనా జాతీయుల ప్రమేయం 

అయితే విచారణలో అంతకుముందు తన ఎలక్ట్రానిక్ పరికరాల్లోని డేటాను ఆమె డిలీట్ చేసినట్లు అధికారులకు గుర్తించారు. దర్యాప్తును మళ్లించేందుకు ఉద్దేశపూర్వక సైంటిస్టులు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. కానీ, అనంతరం ఆ ప్యాకేజీలు తనవేనని హాన్ ఒప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ అక్రమ రవాణాకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP)తో సంబంధాలు ఉన్న వ్యక్తుల హస్తం ఉందని, అమెరికాలోని విద్యాసంస్థల్లో ఉండే చైనా జాతీయుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

బయోలాజికల్‌ గూడ్స్‌ స్మగింగ్‌ లో చెనాకు చెందిన మూడో వ్యక్తి హాన్‌

ఇదిలా ఉండగా, హాన్‌ ఈ తరహాలో బయోలాజికల్ గూడ్స్‌ అక్రమ రవాణా చేస్తూ అరెస్టయిన మూడో చైనా వ్యక్తిగా గుర్తింపు పొందింది. గత వారం మరో చైనా జంట.. మిచిగన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న పరిశోధకురాలు యుంకింగ్ జియాన్, ఆమె ప్రియుడు జున్యోంగ్ లియు.. వ్యవసాయ పంటలను నాశనం చేసే ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికాలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఈ చర్యను అమెరికా ఆహార సరఫరా వ్యవస్థపై జరిగే ఒక రకమైన దాడిగా FBI అంచనా వేసింది.