Page Loader
Pakistan: పాకిస్తాన్‌లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్.. ఇస్లామిక్ పార్టీ నాయకుడు, మరో ముగ్గురికి గాయాలు  
పాకిస్తాన్‌లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్

Pakistan: పాకిస్తాన్‌లో మరో దాడి.. మసీదులో బాంబ్ బ్లాస్ట్.. ఇస్లామిక్ పార్టీ నాయకుడు, మరో ముగ్గురికి గాయాలు  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తాలిబన్ల దాడులతో పాకిస్థాన్ ఉద్రిక్తతతో ఉలిక్కిపడుతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు జరుగుతాయో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ట్రైన్ హైజాక్, ఆత్మాహుతి దాడులు జరిగిన కొన్ని గంటలకే మరోసారి పాకిస్తాన్‌లో దాడి చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్‌లో, శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓ మసీదులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్థానిక ఇస్లామిక్ నాయకుడు సహా ముగ్గురు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

వివరాలు 

 విషమంగా నదీమ్‌ పరిస్థితి

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జామియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ (JUI-F) పార్టీకి చెందిన స్థానిక నాయకుడు అబ్దుల్లా నదీమ్ లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నదీమ్‌ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, అతని పరిస్థితి విషమంగా ఉంది. మౌలానా అబ్దుల్ అజీజ్ మసీదులో జరిగిన ఈ పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు.