Page Loader
Pakistan: పాకిస్థాన్‌ను వణికిస్తున్న 'ఆపరేషన్ బామ్‌'.. బలోచిస్థాన్‌లో ఒకేసారి 17 దాడులు
పాకిస్థాన్‌ను వణికిస్తున్న 'ఆపరేషన్ బామ్‌'.. బలోచిస్థాన్‌లో ఒకేసారి 17 దాడులు

Pakistan: పాకిస్థాన్‌ను వణికిస్తున్న 'ఆపరేషన్ బామ్‌'.. బలోచిస్థాన్‌లో ఒకేసారి 17 దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో బలోచ్ తిరుగుబాటు గుంపులు మరింత ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. తాజాగా దక్షిణ బలోచిస్తాన్‌ ప్రావిన్స్‌లో వారిచేసిన దాడులు తీవ్రతరం అయ్యాయి. పలు వాహనాలను నిలిపివేసి, అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిని బలవంతంగా తీసుకెళ్లి కాల్చిచంపారు. ఈ దాడి గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సమాచారం మేరకు, ముందుగా ఆ బస్సులను అడ్డగించిన రెబల్స్, ప్రయాణికులను కిడ్నాప్‌ చేసి, సమీప పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. అనంతరం వారిని అక్కడే హత్య చేసినట్లు ఒక ఆంగ్ల వార్త సంస్థ నివేదించింది. అర్ధరాత్రి సమయంలో వారి మృతదేహాలు వెలుగులోకి వచ్చాయని ఒక ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

వివరాలు 

పాకిస్థాన్‌పై 'ఆపరేషన్‌ బామ్‌' 

ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థనైనా బాధ్యత వహించలేదు. అయితే, గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడిన చరిత్ర బలోచ్‌ రెబల్స్‌ ఖాతాలో ఉంది. ముఖ్యంగా పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారినే లక్ష్యంగా తీసుకుని ఈ హత్యలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. పాక్ ప్రభుత్వంపై బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) అత్యంత ఘాటుగా విరుచుకుపడింది. మంగళవారం ప్రారంభించిన ఈ ఉగ్రదాడికి 'ఆపరేషన్ బామ్‌' అనే పేరు పెట్టారు. ఈ దాడులలో ప్రభుత్వ,సైనిక స్థావరాలను ప్రధానంగా టార్గెట్ చేశారు.

వివరాలు 

పాకిస్థాన్‌పై 'ఆపరేషన్‌ బామ్‌' 

దశాబ్దాలుగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటానికి ఇది ఒక కొత్త అధ్యాయంగా నిలిచిందని BLA ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో పంజ్‌గర్‌, సురబ్‌, కెచ్‌, ఖరన్‌ జిల్లాల్లో కలిపి మొత్తం 17 దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల లక్ష్యాలలో ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక చెక్‌పాయింట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో BLA ప్రతినిధి మాట్లాడుతూ, బలోచిస్తాన్ విమోచన యుద్ధంలో ఇది మరో కొత్త ఉదయం అని వ్యాఖ్యానించారు. భద్రతా సిబ్బంది, వారి ఆయుధాలు ప్రధాన లక్ష్యంగా ఉన్నాయని వెల్లడించారు.