LOADING...
Nepal Gen Z unrest: నేపాల్ లో దారుణం... భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి
నేపాల్ లో దారుణం... భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి

Nepal Gen Z unrest: నేపాల్ లో దారుణం... భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ రాజధాని ఖాట్మండు వద్ద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన యాత్రికుల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేసి, ప్రయాణికుల వస్తువులు చోరీ చేసారు. పశుపతినాథ్ ఆలయం దర్శన అనంతరం తిరిగి వస్తున్న బస్సుపై గురువారం ఉదయం ఈ దాడి జరిగింది. దుండగులు బస్సు కిటికీల నుండి బ్యాగ్లు,నగదు, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లారు. ఈ దాడిలో దాదాపు 7-8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నేపాల్ సైనికులు వెంటనే స్పందించి, బాధితులను రక్షించారు. అనంతరం భారత ప్రభుత్వం చర్యలు తీసుకొని, ఖాట్మండు నుంచి ఢిల్లీకి ప్రయాణికులను విమాన మార్గంలో తరలించింది.

వివరాలు 

సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు

బాధిత బస్సు సోనౌలి సరిహద్దుకు చేరింది. ప్రస్తుతం నేపాల్‌లో అశాంతి పరిస్థితుల కారణంగా భారత ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచింది. రెండు రోజుల పాటు మాత్రమే నేపాల్ పౌరులను వారి పౌరసత్వ కార్డులతో మాత్రమే భారత్ లోకి రావడానికి అనుమతించారు. నేపాల్‌లో పరిస్థితులు సద్దుమణిగే వరకు భద్రత చర్యలు కట్టుదిట్టంగా కొనసాగనున్నాయి.