Page Loader
Los Angeles:కాలిఫోర్నియా అడవిలో అగ్నిప్రమాదం.. 7కి పెరిగిన మృతుల సంఖ్య, 5,000 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసం 
కాలిఫోర్నియా అడవిలో అగ్నిప్రమాదం.. 7కి పెరిగిన మృతుల సంఖ్య, 5,000 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసం

Los Angeles:కాలిఫోర్నియా అడవిలో అగ్నిప్రమాదం.. 7కి పెరిగిన మృతుల సంఖ్య, 5,000 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు సంపదతో తులతూగిన లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) నగరం ప్రస్తుతం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో అక్కడి ధనవంతులు, హాలీవుడ్‌ స్టార్‌లువదిలేసి వెళ్లిపోయిన,ఇళ్లలో విలువైన వస్తువులు దొంగల చేతిలోకి పోయాయి. ఇటీవల, షరీఫ్‌ డిపార్ట్‌మెంట్‌ 20 మంది లూటర్లను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఎవరైనా వదిలేసిన ఆస్తులను జోలికివస్తే , వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రజలను సంక్షోభ సమయంలో దోచుకునే వారు సిగ్గుపడాలని కౌంటీ సూపర్‌వైజర్‌ కాథరిన్‌ బెర్జర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల షరీఫ్‌ డిపార్ట్‌మెంట్‌ గస్తీలను అమలు చేస్తోంది.

వివరాలు 

పాలిసాడ్స్‌లోనే 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి.

పసిఫిక్‌ పాలిసాడ్స్‌ ప్రాంతం భారీ అగ్నిప్రమాదంతో పూర్తిగా కాలిపోయింది. ఈ విషయాన్నీ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా చెబుతున్నాయి. ఆల్టడెనా ప్రాంతంలో 83 ఏళ్ల వృద్ధుడు ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మొత్తం 9,000 నిర్మాణాలు కాలిపోతే, పాలిసాడ్స్‌లోనే 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. ఉడ్‌లాండ్‌ హిల్స్‌ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కార్చిచ్చు పెట్టాడని అనుమానంతో భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పాలిసాడ్స్‌లో దాదాపు 20,000 ఎకరాలు,ఈటన్‌ ఫైర్‌ 13,600 ఎకరాలు,కెన్నెత్‌ ఫైర్‌ 791 ఎకరాలు, సన్‌సెట్‌ ఫైర్‌ 60 ఎకరాలు, హురస్ట్‌ ఫైర్‌ 855 ఎకరాలను దహించేశాయి. ఈ ప్రక్రియలో 1.80 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.

వివరాలు 

రూ.12 లక్షల కోట్ల నష్టం.. 

ఈ అగ్నిప్రమాదం అమెరికా చరిత్రలో అత్యంత భారీ నష్టం చేసిన కార్చిచ్చు.అక్యూవెదర్‌ సంస్థ అంచనాల ప్రకారం, నష్టం 150 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.12 లక్షల కోట్లు)గా ఉంటుంది. 24 గంటల్లోనే ఈ అంచనాలు మూడు రెట్లు పెరిగాయి.ఇక్కడ ఉన్న అత్యంత ఖరీదైన గృహాలు ఇందుకు కారణమని వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్‌ పోర్టర్‌ తెలిపారు. పెనుగాలులు మంటలను విస్తరింపజేస్తున్నాయి. అమెరికా బీమా రంగం కూడా ఈ అగ్నిప్రమాదం వల్ల తీవ్రంగా ప్రభావితమైంది.జేపీ మోర్గాన్‌, మార్నింగ్‌ స్టార్‌ అంచనాల ప్రకారం,బీమా సంస్థలకు 20 బిలియన్‌ డాలర్ల వరకు నష్టం వచ్చేది. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్‌ ఫామ్‌ కొన్ని నెలల క్రితం కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు ముప్పు ఉందని భావించి పాలసీలు ఇవ్వడం మానేసింది.

వివరాలు 

బాధితులకు బీమా కష్టాలు.. 

తాజాగా ఈ ప్రాంతంలో ఇప్పుడే 5,600 ఇళ్లు కాల్చేసింది. గత మూడేళ్లలో చాలా బీమా సంస్థలు ఈ ప్రాంతాల్లో కవరేజీని తగ్గించేశాయి. ఇక, దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బాధిత ప్రాంతాల్లో ఆరు నెలలపాటు ప్రభుత్వ సహాయం ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు. నీరు సరిపోవడం లేదు.. అయితే, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తూనే ఉంటే, గాలుల కారణంగా ఆగిపోతున్నాయి. నీటి సరఫరా సమస్యలు కూడా అగ్నిమాపక చర్యలను కష్టతరంగా మారుస్తున్నాయి. ఫైర్‌ హైడ్రాంట్స్‌ కూడా త్వరగా ఖాళీ అవడం ఈ సమస్యకు ప్రధాన కారణమైంది.

వివరాలు 

బన్నీ మ్యూజియం అగ్నికి ఆహుతి.. 

ప్రపంచంలోనే అతిపెద్ద బన్నీ మ్యూజియం కూడా ఈ కార్చిచ్చులో పూర్తిగా దగ్ధమైంది. గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన 46,000 కుందేళ్ళ రూపంలో ఉన్న వస్తువులు ఈ మంటల్లో కాలిపోయాయి.