
Canada : కెనడాలో హిందీ ప్రేక్షకులు పరుగో పరుగు.. గ్యాస్' స్ప్రేతో 3 థియేటర్లు ఖాళీ
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని సినీ థియోటర్లలో ప్రేక్షకులు భయాందోళకు గురయ్యారు.గుర్తు తెలియని దుండగులు సినీ థియోటర్లోకి ప్రవేశించి, ఏరోసోల్ పదార్థాన్ని స్ప్రే చేశారు.
దీంతో ఆడియన్స్'కి చికాకు, కలిగి దగ్గు బారిన పడ్డారు. దీంతో వెంటనే మూడు సినిమా టాకీసులను ఖాళీ చేసేశారు.
గ్రేటర్ టొరంటోలో 3వేర్వేరు ప్రాంతాల్లోని అనేక మంది సినీప్రేక్షకులు థియేటర్లను ఖాళీ చేశారు.
అయితే కెనడాలో ఈ వారం ప్రారంభంలో, హిందీ సినిమాలను ప్రదర్శించే థియేటర్‌లలో ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఏరోసోల్ పదార్థాన్ని స్ప్రే చేశారు.ఫలితంగా కొందరు ఆస్పత్రుల్లో చేరారు. ఈ ఘటనల్లో పెద్దగా ఎలాంటి గాయాలు కాలేదు.
వాఘన్ ప్రాంతంలోని సినిమా థియేటర్‌లో మంగళవారం రాత్రి అలాంటి సంఘటనే ఒకటి జరిగిందని యార్క్ ప్రాంతీయ పోలీసులు అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెనడాలోని సినీ టాకీసుల్లో దుండగుల బీభత్సం
Hindi Moviegoers At 3 Canada Theatres Evacuated After Masked Men Spray 'Unknown Gas'https://t.co/2Dt8NQPnOI
— TIMES NOW (@TimesNow) December 7, 2023